Search This Blog

Monday, July 28, 2014

तन्हाई..!



तन्हायियों में जागती हुँ
तन्हायियों में सोती हूँ ...
न सुबह हुई 
न शाम हुई...
मूह मोड़ के न बैठी हूँ
कोई अकेलेपन की साया में ...
मेहकती फूलों के खुश्बुओं से भरा
ये सुहाने मौसम में
न में हुँ न मेरी छाया है
सिर्फ मेरा मन है उसी तन्हायियों में...
चमकते हुए शबनम के पतझड़ों पर
खिलती हुयी मुस्कराहट की तरह
युही गुनगुनाती हुँ उसी तन्हायियों में...
न मंजिल है न ठिकाना है
चलती रही हूँ राहों में नंगे पाँव
यूही उसी तन्हायियों में..!!

Friday, July 25, 2014

భావన..!


'కల 'వరింతలన్నీ కలలే కాబోలు అని 
కలత నిద్దురలో కన్ను మూయలేని మోమాటం.,
వలచి వచ్చే వరుని కోసం
వలపులన్నీ తలపులలో దాచిపెట్టి
తలుపులన్నీ తెరచి ఉంచిన ఆరాటం., 
వేళ కాని వేళలోన కోయిలమ్మ పాటకి 
చెప్పలేని భావమేదో చివురులు తొడిగిన వాసంతం.,
ముసిరే మబ్బులకు పిల్లగాలుల పలకరింపులు తోడై
మురిసే ఆశలన్నీ జల్లులుగా కురిసే వేళకి
మరులన్నీ మనోవిరులై విరబూసిన వింత పరిమళం..!

Sunday, July 20, 2014

శుభాకాంక్షలు...




మనసు కన్నుల తోటలోన 
విరిసె చక్కని పూవు ఒకటి
తావి తావిని కౌగిలించు
పరిమళమ్ములు చిలుకరించు 
పరవశమ్ముల తేలిపోవుచు 
తరలి వచ్చెను తనకు తానే
వెడలిపోయిన వసంతమ్ము
స్వాగతమ్ములు పలుకుచుండగ 
కిలకిలా కులుకుచూ
నడచి వచ్చెను చిన్నారి పువ్వు
ఇప్పుడే జనియించిన అందాల నవ్వు..!    

పుట్టిన రోజు 'సుభా'కాంక్షలు రసజ్ఞా :)     


Wednesday, April 30, 2014

ఆ ఒక్కటి చాలు..

Photo on Internet
మనసును మరిపించే
మధుర క్షణం ఒక్కటి చాలు..
మాసిపోయిన మమతలన్నీ మరులై పూయడానికి.,
కళ్ళను కవ్వించే చిలిపి నవ్వు ఒక్కటి చాలు..
కలల అలలపై వలపు కలువలు విరబూయడానికి.,
కరిగిపోయే కాలంలో
మరపురాని జ్ణాపకం ఒక్కటి చాలు..
మోడై నిలిచిన చెలిమి మళ్ళీ చివురులు తొడగడానికి.,
కమ్మని పాటల
ఆ కోయిలమ్మ పిలుపు చాలు..
తరలిపోయిన వసంతాలు తిరిగి అరుదెంచడానికి.,
తెలియని దారుల్లో..
తరగని పయనంలో..
అలసిన వేళల్లో..
బాధల నిట్టూర్పుల్లో..
నీ స్నేహం ఒక్కటి చాలు..
నా చిరు చిరు ఆశల దీపాలు వెలిగించడానికి..!!!