Search This Blog
Monday, November 14, 2022
Saturday, November 12, 2022
చీకటి నవ్వు
కాలం లోగిలిలో
తలపుల కౌగిలిలో
మాటని మౌనం పెనవేసి
కళ్ళని కన్నీరు కమ్ముకొని
తరలిపోయిన వసంతం కోసం
కరిగిపోని ఆశనై
చీకటి నవ్వునై వేచి ఉన్నాను..!🌑❤🌑
Wednesday, November 9, 2022
Wednesday, December 31, 2014
నూతన సంవత్సర 'సుభా'కాంక్షలు..!
మూసిన ఆ కనులలో ముసుగేసిన కలలెన్నో
రెప్పల మాటున దాగిన ఆ కలలలో కలవరించే ఆశలెన్నో
ఆశల సెలయేరులలో ఉరికే ఊహలెన్నో
ఊయలలూగే ఆ ఊహలలో చిగురించే వలపులెన్నో
తేనెలొలికే ఆ వలపులలో విరబూసే తలపులెన్నో
తీయని ఆ తలపులలో తరలిపోయే కాలాలెన్నో
కదిలిపోయే ఆ కాలాలలో మరపురాని గురుతులెన్నో
ఆ పువ్వులవలె గుబాళించే గురుతులలో.,
ఏ నవ్వులో చిలుకరించే పెదవులలో.,
మరల మరల తరలివచ్చే వసంతాలకు
పులకరింపుల మమతలన్నీ తోరణాలు
పరిమళించే మల్లెపూల స్వాగతాలు
పలుకరించే ప్రతి ఒక్కరి మనస్సులలో..!
అందరికీ నూతన సంవత్సర 'సుభా'కాంక్షలు..! :) :)
Sunday, December 28, 2014
Madilo Edo Edo (మదిలో ఏదో ఏదో)
మదిలో ఏదో ఏదో
అలజడి మొదలయ్యింది
కనులను కలిసిన కల ఏదో
నీ కబురే తెలిపింది
నిను చూసిన ఆ క్షణమే
నను మరిచే మరి మనసే
నిను కలిసిన ప్రతి కలలో
కలిగిందీ కలవరమే
ఆశలు ఆకాశపు అంచులు తాకి ఎగసినవో
ఆమని ఆనందపు చిగురులు తొడిగి మురిసినదో
వయసుకు తొలిసారి గుండెలో చప్పుడు తెలిసినదో
వేకువ తలపుల్లో వలపుకు తలుపును తెరిచినదో
ఏమో ఏమైందో
నా ఊహ నిన్ను చేరే వేళ
మనసుల తోటల్లో నీ రాకే తుమ్మెద పిలుపో
విరిసిన పువ్వుల్లో నీ నవ్వే తేనెల చినుకో
అడుగులు నీ వైపే పదపదమంటూ తరిమినవో
అలుపన్నది లేని తలపుకు నీవే ఎద సడివో
ఏమో ఏమౌనో
నా ఊపిరే నువు రాకుంటే
మదిలో ఏదో ఏదో
అలజడి మొదలయ్యింది
కనులను కలిసిన కల ఏదో
నీ కబురే తెలిపింది
Subscribe to:
Posts (Atom)

