Search This Blog

Thursday, August 4, 2011

నీ చెలిమి లో

రేపు మళ్ళీ ఈ రోజు లాగే ఉండొచ్చు.,
మనలో ఎవరెవరు ఎక్కడ ఉంటారో.,
ఎపుడో దాచిన పువ్వుకు
పుస్తకం చిరునామా ఐనట్టు.,
నీ చెలిమి లోని ఎడబాటుకు కూడా
బహుశా ఏదో చిరునామా ఉండే ఉంటుంది...
ఇక జీవితంలో నిన్ను కలవనీ, కలవకపోనీ
కానీ గడిపిన ప్రతిక్షణం గురుతే ఉంటుంది...
అందుకే ఇది సృష్టి లోనే మధురం
కరిగిపోని, చెరిగిపోని ఈ స్నేహం..!!  

Saturday, July 9, 2011

మరో ఉగాది...

తొలి పొద్దుల్లో వేకువవై
 నిదురించిన మదికి మేలుకొలుపువౌతావు..
 సుప్రభాత వేళల్లో
 మంచు బిందువును తాకిన తొలి కిరణంలా
 వింత మెరుపులు చిందుతావు..
 కుహు కుహూల సంగీతమై
 గుండె గొంతుకలో పలుకరిస్తావు..
 చిగురించే చిరు చిరు ఆశలకు
 రెక్కలు తొడుగుతావు..
 గతించిన నిన్నని కాలానికి వదిలేయమని
 మనసులోని భావాలకు
 కొత్త సొబగులద్దిన ఈ తరుణాన.,
 నీ పలకరింపు నాకు ఇంకో
 ఉగాది అయింది మిత్రమా ! ! !

Monday, July 4, 2011

మౌన భాష్యం...

యెద లయలో ఎన్నో సరిగమలు
వాటికి రాగం లేదు...
గుండె లోతులో ఎన్నో గుసగుసలు
వాటికి లిపి లేదు...
వివరించాలని ఊగే మనసుకు
మౌనమే భాషగా మారి
పెదవులపై చిరుహాసమై పోయి
కనుల కొలనుల్లో కలువలై విరబూసాయి ! ! !